ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
కేవీపల్లె : ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం పనిగా పెట్టుకుందని విమర్శించారు. వారి అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉండడంతో అనతికాలంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమస్యలపై అర్జీలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాధికారులు పార్టీలకు అతీతంగా చిత్త శుద్ధితో పని చేయాలన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజలు సమస్యలను నేరుగా తమకు తెలుపుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, హరీష్‌రెడ్డి, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, నల్లారి తిమ్మారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి


