భూమి ఆక్రమిస్తున్నారయ్యా..
కలెక్టరేట్ వద్ద బైఠాయించిన 84 ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు షంషాద్‌బీ. గాలివీడు మండలం. దశాబ్దాలుగా ఈమె ఆధీనంలో సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. భూమిని కబ్జా చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా ఫలి తం శూన్యం. పోలీసులు, రెవెన్యూ అధికారులకు తన ఆవేదన తెలియజేసినా అది అరణ్య రోదనగానే మిగిలింది. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించిన ఈ వృద్ధురాలికి కమ్యూనిస్టు మార్కిస్టు పార్టీ నేతలు గుజ్జుల రమణయ్య, పోరెడ్డి రమణారెడ్డిలు సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుపై నిరసనలో పాల్గొన్నారు. వృద్ధురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


