చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని గుండ్లమూలపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వల్లూరు మండలానికి చెందిన పెద్ద పిల్లోళ్ల రెడ్డయ్య (40) అనే వ్యక్తి చెట్టుపై నుంచి కిందపడి మృతిచెందాడని ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. వల్లూరు మండలం పెద్ద లేబాక ఎస్సీ కాలనీకి చెందిన పెద్దపిల్లోళ్ల రెడ్డయ్యతో పాటు మరి కొందరు కూలీలను కడపకు చెందిన చాన్‌బాషా అనే వ్యక్తి గుండ్లమల్లపల్లె గ్రామానికి చెట్లు కోసేందుకు తీసుకొచ్చాడు. స్థానికుడు చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన చెట్లను చాన్‌బాషా కొనుగోలు చేసి వాటిని రంపం మిషన్‌తో కట్ చేసి అమ్ముకునే వాడు. రెడ్డయ్య అనే వ్యక్తి చెట్టుపైకి ఎక్కి రంపం మిషన్‌తో కొమ్మలను కట్ చేస్తుండగా మిషన్ ఇరుక్కుపోవడంతో ఆయన గొడ్డలితో కొమ్మను కొట్టే ప్రయత్నం చేశాడు. కొమ్మ విరిగి అతనిపై పడటంతో అదుపు తప్పి కింద ఉన్న కొమ్మలపై బోర్లా పడ్డాడు. కింద ఉన్న కొమ్మ రెడ్డయ్య ఛాతికి తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లీలావతి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడి
ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన మదన్‌మోహన్(20) కార్పెంటర్‌గా పనిచేస్తాడు. సోషల్‌మీడియా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పెద్దమండ్యంకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే ఈ వ్యవహారంలో మనస్తాపం చెందిన మదన్‌మోహన్ సోమవారం ప్రేమికురాలి ఇంటి వద్దకు వెళ్లి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి
పీలేరు రూరల్ : చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ సూరప్పచెరువులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం గూడరేవుపల్లె పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన బి. ఆనంద (55) తమ అల్లుళ్లు వినోద్, హరి, తమ్ముడు టి.వినోద్‌తో కలసి సూరప్పచెరువుకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో వల వేసి తీసే క్రమంలో నీటి లోపల ఉన్న పాచి తగులుకుని మునిగిపోయాడు. ఆయన అల్లుళ్లకు ఈత రాకపోవడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు చెరువులోంచి ఆనందను వెలికి తీశారు. అయితే అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
కరెంట్ షాక్‌తో
వలస కూలీ..
రాజంపేట : రాజంపేట–రాయచోటి రహదారిలో ఎస్‌ఆర్‌పాళెం సమీపంలో కొరముట్ల హరి అనే వ్యక్తికి చెందిన రేకులషెడ్ నిర్మాణంలో కరెంట్‌షాక్ తగిలి పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజ్ అనే వలస కూలీ సోమవారం మృతి చెందాడని పోలీసువర్గాలు తెలిపాయి. మృతుడు మైనర్‌గా భావిస్తున్నారు. రేకులషెడ్ నిర్మాణ క్రమంలో క్రేన్‌తో ఇనుపకడ్డీలు పైకి ఎత్తే సమయంలో అదే ప్రదేశంలో ఉన్న విద్యుత్ తీగలు తగలగానే షాక్‌కు గురయ్యాడు. ఆర్‌ఎస్‌రోడ్డులో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై మన్నూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఒంటిమిట్టలో వైకుంఠ
ఏకాదశికి ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 30న జరిగే వైకుంఠ ఏకాదశికి టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు 30వ తేదిన అర్థరాత్రి 1:35 నిమిషాలకే వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తునట్లు ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి


