సంక్రాంతి సంబరాలకు నాంది క్రీడలు
రాజంపేట టౌన్ : సంక్రాంతి సంబరాలకు క్రీడలే తొలుత నాంది పలుకుతాయని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పోలి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం సీనియర్ నాయకుడు పోలి రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ అని, ఈ పండుగను పురస్కరించుకొని రఘునాఽథ్‌రెడ్డి యువతను ప్రోత్సహించేందుకు ఖర్చుకు సైతం వెనకాడకుండా క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండటం ఎంతైనా అభినందనీయమని కొనియాడారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు డి.భాస్కర్‌రాజు, క్రికెట్ పోటీల ఆర్గనైజర్లు పోలి సుకుమార్‌రెడ్డి, సి.మనోహర్‌రెడ్డి, గానుగపెంట కిషోర్, వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు సనిశెట్టి నవీన్‌కుమార్, దండు గోపి, హరి, బొజ్జా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి


