బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం
రాయచోటి : వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పోలీస్ కార్యాలయాలకు వచ్చేవారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం చేయాలని ఆదేశించారు. పెద్దమండ్యం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు కార్యాలయానికి రాగా ఎస్పీ ఆయన వద్దకే వెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. జిల్లా కార్యాలయానికి రాలేని వారు తమ సమీప పోలీసు స్టేషన్‌లో, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఇచ్చే ఫిర్యాదులను కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలుగానే పరిగణించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి


