మా ఊరి రాత మారింది..
నా 70 ఏళ్ల వయసులో మా ఊరిలో ఒక్క ప్రభుత్వ భవనం ఏర్పాటైంది చూడలేదు. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి భవనాలు నిర్మించారు. గతంలో కనసానివారిపల్లెగా ఉండేది. జగన్ పాలనలో పంచాయతీగా చేశారు. దశాబ్దాలుగా మేం ఎరుగని అభివృద్ధి పనులు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో కళ్లారా చూశాం. గ్రామస్తులు ఒక సమస్య గురించి నేతలు, అధికారులకు పదేపదే అడిగినా స్పందించడం, పరిష్కరించడం అరుదు. అలాంటిది మేం అడకపోయినా అభివృద్ధి ఫలాలను మా పల్లె ముంగిటకే తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. మా ఊరునుంచే బైపాస్‌రోడ్డు కూడా పోతోంది. సిమెంటురోడ్లు, మురికినీటి కాలువలు నిర్మించి మౌలిక వసతులు కల్పించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే. –జి.లక్షుమ్మ, కనసానివారిపల్లి


