డిజిటల్ ప్రయోగాల వినియోగంపై శిక్షణలో మడితాటి
రాయచోటి టౌన్ : ఢిల్లీ (ఎన్‌సీఈఆర్‌టీ)లో సాంఘికశాస్త్రం బోధనలో అమలు పరుస్తున్న డిజిటల్ ప్రయోగాల (వర్చువల్ ల్యాబ్స్)పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శిక్షణలో రాయచోటి డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి పాల్గొన్నారు. గత రెండు రోజులు (18,19) రోజులు నిర్వహించిన ఈ శిక్షణలో భాగంగా ఆయన పాల్గొని సాంఘిక శాస్త్రం బోధనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ట్రైనర్లు పాల్గొని సాంఘికశాస్త్ర బోధన అంశాలపై డిజిటల్ ప్రయోగాల అమలు వలన పాఠ్యపుస్తకాలలోని కఠినమైన భావాలను విద్యార్థులకు సులభతరంగా అర్థం అయ్యే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణ వలన బోధన –అభ్యాసన పక్రియ మరింత ఆసక్తిగా మారుతుందని తెలిపారు. వర్చువల్ ల్యాబ్స్, యానిమేషన్లు, ఇంటరాక్టీవ్ మ్యాప్స్. సిమ్యులేషన్స్ ద్వారా భౌగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలపై విద్యార్థులకు అనుభావత్మకంగా (లెర్నింగ్ బై డూయింగ్) నేర్చుకొనే అవకాశం లభిస్తుందన్నారు. డిజిటల్ పద్దతి ద్వారా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. ఈ శిక్షణలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర పి బెహరా, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ బింజా, అనేక రాష్ట్రాల నుంచి ఎన్‌సీఈఆర్‌టీ అధ్యాపకులు, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారని తెలిపారు.


