కార్మికుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి పడి భవననిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ విజయనగర్‌కాలనీకి చెందిన వీరభద్ర(55) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా డు. బాబూకాలనీలో ఓ ఇంటిపై పనులు చేస్తుండ గా, అక్కడ అమర్చిన సారువ కొయ్యలు బ్యాలె న్స్ తప్పడంతో మిద్దైపె నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కరెంట్‌షాక్‌తో
యువకుడికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కరెంట్‌షాక్‌తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్‌మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్‌కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు.
కారు – ద్విచక్రవాహనం ఢీ
– భార్యభర్తలకు తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : కారు – ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన పీలేరు శివారు ప్రాంతం బోడుమల్లువారిపల్లె సమీపంలో చోటు చేసుకుంది. సుండుపల్లె మండలం గొల్లపల్లెకు చెందిన ఆనంద్ (30), భార్య శ్రావణి (27) పీలేరులో టీ హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యభర్తల తోపాటు కుమారుడు అభయ్‌కుమార్ ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాణిపాకం వెళుతున్న కారు బోడుమల్లువారిపల్లె వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
ప్రమాదంలో గాయపడ్డ ఆనంద్, శ్రావణి
కార్మికుడికి తీవ్ర గాయాలు
కార్మికుడికి తీవ్ర గాయాలు
కార్మికుడికి తీవ్ర గాయాలు


