ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం
మదనపల్లె రూరల్ : మండలంలోని వలసపల్లె పంచాయతీలో ఎనిమిదేళ్ల బాలికపై, 22 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం చేసిన ఘటన రెండురోజుల తర్వాత వెలుగుచూసింది. బాధిత బాలిక తండ్రి మృతి చెందగా, తల్లి వదిలేసి వెళ్లడంతో ఆ బాలిక అవ్వ వద్ద ఉంటోంది. స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. 17వ తేదీ పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా, గ్రామానికి చెందిన వరుణ్(22) ఊరు బయటకు ఎత్తుకువెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా, గమనించిన గ్రామస్తులు అడ్డుకోగా, నిందితుడు వరుణ్ పారిపోయాడు. జరిగిన ఘటనపై బాలిక అవ్వ, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు జి.నాగరాజరెడ్డి, గ్రామస్తులతో కలిసి తాలూకా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై సీఐ కళావెంకటరమణకు ఫిర్యాదుచేసింది. ఆమేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం గ్రామానికి వెళ్లిన సీఐ, అత్యాచార ఘటనపై విచారణ చేశారు. కాగా, నిందితుడు వరుణ్, ఏడాదిన్నర క్రితం గ్రామానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అప్పట్లో గ్రామస్తులు మందలించి వదిలేసినప్పటికీ, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. చిన్నబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడేటటువంటి కామాంధుడు వరుణ్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు.
నిందితుడిపై పోక్సో కేసు నమోదు


