ఆసుపత్రి కమిటీ సభ్యురాలిపై తెలుగు తమ్ముళ్ల దాడి
టాస్క్‌ఫోర్స్ : రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల దాడిలో తెలుగు మహిళా నేత, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు లక్ష్మీదేవి రక్త గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రాయచోటి పట్టణం, రాజుల కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురువారం ప్రచారంలోకి వచ్చింది. రాయచోటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తన అనుచరులతో పార్టీ సీనియర్ కార్యకర్త, హాస్పిటల్ కమిటీ సభ్యురాలు ఆర్.లక్ష్మీదేవిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్థానికులు తెలిపారు. తనపై గండికోట సుధాకర్, మరికొందరు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని గాయపడిన లక్ష్మీదేవి రాయచోటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఇరువురు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు, పార్టీ పెద్దల సమాచారం కోసం ఫిర్యాదును పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.


