పేద,మధ్య తరగతి విద్యార్థులకు నష్టం
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణతో పేద,మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుంది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా జరిగింది. పీపీపీ విధానంతో వైద్యం ఖరీదుగా మారుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గం.
–విజయ్‌బాబు, విద్యార్థి,మదనపల్లె
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే బాగుంటుంది
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటైతేనే బాగుంటుంది. కన్వీనర్ కోటా కింద సీట్లు వచ్చినా పేద విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలు కళాశాలలవైపు కన్నెత్తి కూడా చూడలేరు. – నందిని,
ఇంటర్ నర్సింగ్ విద్యార్థిని, రాజంపేట
ప్రైవేట్‌కు కట్టబెట్టొద్దు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలల ఏర్పాటును సంకల్పించి కొన్నింటిని పూర్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –ఎం.వనజారాణి,
బోస్‌నగర్, రాయచోటి పట్టణం
పేద,మధ్య తరగతి విద్యార్థులకు నష్టం
పేద,మధ్య తరగతి విద్యార్థులకు నష్టం


