ఇస్తిమా నిర్వహణపై సీఐ సమీక్ష
రామసముద్రం : మండల కేంద్రంలో జనవరి 7, 8 తేదీలలో ముస్లింలు నిర్వహించే ఇస్తిమా కార్యక్రమంపై బుధవారం మదనపల్లి రూరల్ సీఐ రవి నాయక్ భద్రతాపరమైన చర్యలపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తిమా జరుగుతున్న ప్రదేశంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడుతూ కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ఎలాంటి అపోహలు, వివాదాలు తలెత్తకుండా చూడాలన్నారు. వలంటీర్లను నియమించి క్యూ లైన్లు, పార్కింగ్ సమస్య రాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ దిలీప్ కుమార్, పోలీస్ సిబ్బంది బాలాజీ, లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


