జల్ జీవన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
లక్కిరెడ్డిపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు శుద్ధమైన నీటిని అందించేందుకు జల్ జీవన్ పథకం ప్రవేశపెట్టాయ, ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి ప్రభుత్వం మంచినీరు అందిస్తుందని ఐఏఎస్ అధికారి హరినారాయణ పేర్కొన్నారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్‌లో భాగంగా మంగళవారం మండలంలోని దిన్నెపాడు పర్వతరెడ్డిగారిపల్లి, దప్పేపల్లి, లక్కిరెడ్డిపల్లి గ్రామాల్లోని సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా దిన్నెపాడు గ్రామంలోని పర్వతరెడ్డిగారిపల్లెలో డంపింగ్ యార్డు పరిశీలించారు. పొడి చెత్త, తడిచెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించాలని, దీంతో గ్రామం శుభ్రంగా ఉంటుందని, అంతేకాకుండా ఆర్థికంగా గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. దప్పేపల్లి గ్రామంలో మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి ఉత్పత్తులు దిగుబడులు గురించి రైతులతో మాట్లాడారు. మామిడి రైతులకు సబ్సిడీ ఎరువులు, మందులు ప్రభుత్వం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ రాధమ్మ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి సుభాషిణి, ఎంపీడీఓ రెడ్డయ్య, తహసీల్దార్ క్రాంతి కుమార్, మండల ఉద్యానవన శాఖ అధికారి సింధూరి, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ విద్య, ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ కిషోర్, డిప్యూటీ ఎంపీడీఓ ఉషారాణి, ఎంఈఓ చక్రినాయక్, వెంకటసుబ్బయ్య, నీతి ఆయోగ్ కో–ఆర్డినేటర్ వెంకటరామిరెడ్డి, ఆర్‌ఐ రాజేష్, అన్ని శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


