పేదల వైద్యానికి ఇబ్బంది కలుగుతుంది
పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే వైద్య కళాశాలలో పెత్తందారులకు అప్పగించాలని చూడడం దారుణం. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. వీటిని ప్రైవేటీకరిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నడిచేలా ఇంకా ఉద్యమిస్తాం. అలాగే మద్యం అక్రమ కేసు సృష్టించిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహణపై సమాధానం చెప్పు లేకపోయింది.
– పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్యే, తంబళ్లపల్లె


