బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం వెంకటాద్రి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అదనపు ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని, బాధిలకు న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో, సర్కి ల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్ : రాయచోటిలోని వీరభద్రస్వామి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి వీరభద్రస్వామి వారి, భధ్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధరకాల పూలతో అందంగా అలంకరించారు. పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఈవో డివి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులతోపాటు కర్ణాటక భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
అభ్యంతరాలను
24 లోపు సమర్పించాలి
– పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని అనంపురం, చిత్తూరు, కడప, కర్నూల్ పూర్వపు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి (గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సవరించడానికి తాత్కాలిక జాబితాను htppr://rjdrekadapa.bofrpot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈ నెల 24వ తేదీలోల సమర్పించాలని సూచించారు.
పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సులుగా చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 15 మందికి గాను 9 మంది పదోన్నతులు పొందారు. నిబంధనల ప్రకారం ప్రమోషన్ల కౌన్సెలింగ్ ను చేపట్టినట్టు ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ డీఐఈఓగా
సత్యనారాయణరెడ్డి
కడప ఎడ్యుకేషన్ : డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ)గా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ సెక్రటరీ కొన శశిదర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌టీఆర్ జిల్లా పయాకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయన్ను వైఎస్సార్‌జిల్లా డీఐఈఓగా నియమించారు. గతంలో డీవీఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కడప ఆర్‌ఐవోగా పనిచేస్తున్న బండి వెంకటసుబ్బయ్యకు డీవీఈఓను బాధ్యతలను అప్పగించారు. కాగా సత్యనారాయణరెడ్డి నూతన డీఐఈఓగా రెండు రోజుల్లో బాధ్యతలను చేపట్టనున్నారు.
ఇంటర్ ఆర్‌జేడీగా శ్రీనివాసులు...
ఇంటర్మీడియట్ ఎప్‌ఏపీ ఆర్‌జేడీగా శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది. ఈయన ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా డీకే గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా ఆయనను చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా నియమించారు. చిత్తూ రు డీఐఈఓగా నియమించిన శ్రీనివాసులను ఎఫ్‌ఏసీ ఆర్‌జేడీగా కడపకు నియమించారు. ప్రస్తుతం కడప ఆర్‌జేడీగా పనిచేస్తున్న రవిని రాయచోటి డీఐఈఓగా నియమించారు.
బాధితులకు న్యాయం చేయాలి


