అన్నమయ్య మదనపల్లె జిల్లాగా ప్రకటించండి
మదనపల్లె: అన్నమయ్యకు, మదనపల్లెకు బంధం లేదు, మదనపల్లె జిల్లాగా మొదట ప్రకటించి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటే ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌కు ద్రోహం చేసినట్టవుతుందని, కాబట్టి పొరుగు జిల్లాలో ఉన్నట్టుగా అన్నమయ్య మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిప్పారెడ్డి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి దాకా చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడి మాట మాట్లాడుతున్నారన్నారు. ‘రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందన్నారు, రాజంపేటను జిల్లా చేస్తామన్నారు, మదనపల్లె జిల్లాగా చేస్తామని ప్రకటించారు’.. ఇలా మాట్లాడిన చంద్రబాబు భవిష్యత్తులో మదనపల్లెను జిల్లా కేంద్రం కాకుండా చేసినా ఆశ్చర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విభజన అంటూ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని నాలుగు జిల్లాల పరిధిలోకి తెచ్చారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో మదనపల్లె జిల్లాగా పేర్కొని ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటున్నారు, ఇది అన్యాయమని అన్నారు. చంద్రబాబు పాలన వచ్చాక జిల్లా కేంద్రం రాయచోటిలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు, ఇదే దుస్థితి మదనపల్లెకు కలగదని ప్రకటించగలరా అని ప్రశ్నించారు. రాయచోటిలో ఉంటున్న అధికారులు ఇక్కడికి వచ్చి విధులు నిర్వహిస్తారు, ఇంతకు మించి ప్రభుత్వం మదనపల్లెకు ఏం చేస్తోందని నిలదీశారు. మదనపల్లె, అన్నమయ్య జిల్లాల విషయంలో చంద్రబాబు గందరగోళం సృష్టించారన్నారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించినా ఏమిచ్చారని ప్రశ్నించారసమావేశంలో మాజీ కౌన్సిలర్లు సురేంద్ర, మస్తాన్‌రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు రాజేంద్రనాయుడు, రాష్ట్ర కార్యదర్శి తట్టి నాగరాజరెడ్డి, సర్పంచు శరత్‌రెడ్డి, కోటూరి ఈశ్వర్, రమణ, మహేష్ పాల్గొన్నారు.
చంద్రబాబువన్నీ ఒక్కో చోట ఒక్కో మాట
సమన్వయకర్త నిసార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి


