హార్సిలీహిల్స్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
బి.కొత్తకోట: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ విచ్చేశారు. రెండు రోజులపాటు కొండపై కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విడిది చేస్తున్నారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. గవర్నర్ బంగ్లాలో విడిది ఏర్పాటు చేశారు.
మదనపల్లె రూరల్: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసిన నేపథ్యంలో పాలనాపరమైన అవసరాల కోసం భవనాల ఎంపికలో జిల్లా అధికారులు మంగళవారం పట్టణంలోని పలు భవనాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి రెవెన్యూ సిబ్బందితో కలిసి బెంగళూరురోడ్డులోని రేస్ బీఈడీ కాలేజీ, బీటీ కళాశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి భరత్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ హేమావతి, ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, సీడీపీఓ సుజాత పాల్గొన్నారు.
రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం మాజీఎమ్మెల్యే డాక్టర్ గుంటి వెంకటేశ్వరప్రసాద్(74) మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయనకు ఒక్క కుమారుడు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004–09 మధ్యలో రైల్వేకోడూరుకు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన తండ్రి గుంటి శ్రీరాములు రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పని చేశారు. గుంటి ప్రసాద్ మృతి విషయం తెలుసుకొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నాయకులు చెవ్వు శ్రీనివాసులురెడ్డి, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, తోట శివసాయి, శంకర్‌రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, రమణారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
హార్సిలీహిల్స్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
హార్సిలీహిల్స్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి


