నిత్యావసరాల ధరలపై వైఎస్సార్‌సీపీ నిరసన | YSRCP protest rally against the hike in prices of essential commodities | Sakshi
Sakshi News home page

నిత్యావసరాల ధరలపై వైఎస్సార్‌సీపీ నిరసన

Sep 22 2026 5:25 AM | Updated on Sep 22 2026 5:25 AM

YSRCP protest rally against the hike in prices of essential commodities

నిరసన చేపట్టిన మాజీ ఎంపీ భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారని, ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో చంద్రబాబు తప్పుడు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి నిరసన చేపట్టారు. 

గ్యాస్‌ బండ పట్టుకుని, కూరగాయల దండ మెడలో వేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, నూనె ప్యాకెట్లు, ఉల్లిపాయలు, నిత్యావసరాలను తోపుడు బండిపై పెట్టి ఆయా ధరలు పెంచిన తీరును వివరించారు. నిత్యావసరాల ధరలు తగ్గించే వరకు సామాన్యుడి తరపున  వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement