ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో జోష్‌  | YSRCP Plenary 2022: Josh In YSRCP Activists | Sakshi
Sakshi News home page

YSRCP Plenary 2022: ఉద్వేగం.. ఉత్సాహం: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో జోష్‌ 

Jul 9 2022 7:40 AM | Updated on Jul 9 2022 7:41 AM

YSRCP Plenary 2022: Josh In YSRCP Activists - Sakshi

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: జలయజ్ఞ ప్రదాత, మహానేత వైఎస్సార్‌ వారసుడిగా, జనం కోసం ఇచ్చిన మాటపై నిలబడి వారి సంక్షేమానికే కట్టుబడి పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటలు ప్రత్యక్షంగా వినాలని ఎందరో వృద్ధులు ప్లీనరీకి తరలివచ్చారు.

ఏక ఛత్రాధిపత్యానికి చరమగీతం పాడుతూ, రాష్ట్ర చరిత్రలో సంచలనాలకు వేదికగా నిలుస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పండుగను కనులారా వీక్షించాలని, వయోభారాన్ని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎందరో కార్యకర్తలు ప్లీనరీ ప్రాంగణంలో అడుగుపెట్టారు.

కార్యకర్తల్లో భావోద్వేగం నిండిన ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మూడు చక్రాల బండికి పార్టీ జెండాలను కట్టుకుని.. సిసలైన కార్యకర్తల్లా కొందరు దివ్యాంగులు బారులు తీరిన భారీ వాహనాలను దాటుకుని సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. మరికొందరు వైఎస్సార్‌ చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement