ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను విరమించుకోవాలి | YSRCP leaders protest at Visakhapatnam collectorate | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను విరమించుకోవాలి

Jun 23 2026 4:17 AM | Updated on Jun 23 2026 4:17 AM

YSRCP leaders protest at Visakhapatnam collectorate

విశాఖ కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేతలు

సాక్షి, విశాఖపట్నం: ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమ­వారం విశాఖ కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ ట్రేడ్‌ యూ­నియన్‌న్‌నేతలు పీవీ సురేష్ , రాయపురెడ్డి అనిల్‌కుమార్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు నిర­సన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి  వినతిపత్రమి­చ్చా­రు.

అనంతరం వైఎస్సార్‌సీపీ ని­యో­­జకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు, పలువురు ట్రేడ్‌ యూనియన్, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ..­విద్య, వై­ద్యం, ప్రజా రవాణా వంటి కీలక రంగాలు ప్రభు­త్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్‌ చేశా­రు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయితేనే పేద, మధ్యతరగతి ప్రజలకు ఊర­­టగా నిలుస్తాయన్నా­రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు జాన్‌వెస్లీ, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement