
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు.
శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న కథనాలను ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు ఖండించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన.
