రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో టౌన్‌హాల్ సదస్సులు విజయవంతం
ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో మార్మోగిన రాష్ట్రం
ప్రభుత్వ వైఫల్యాలపై ఫొటో ఎగ్జిబిషన్లు.. నల్ల బెలూన్లతో నిరసనలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిన వైనంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో టౌన్‌హాల్ సదస్సులు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సదస్సులను విజయవంతం చేశారు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ సదస్సుల్లో యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు విశేషంగా పాల్గొని చంద్రబాబు వెన్నుపోటుపై విరుచుకుపడ్డారు. సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాల ప్రాంగణాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశారు. సదస్సుల అనంతరం నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు.
» ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఒంగోలుపార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, అద్దంకిలో నియోజకవర్గ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.
» పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పాలకొల్లులో నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్‌నాయుడు, ఉండి పెదఅమిరంలో జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మత్స ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
» తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలో కో–ఆర్డినేటర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
» డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎసాŠస్‌ర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు.మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో సదస్సు నిర్వహించారు. పార్టీ నేతలు పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో సమావేశం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పల్లిపాలెంలో వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

» కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూటమి మోసాలపై ర్యాలీ, సదస్సు నిర్వహించారు. పెద్దాపురంలో నియోజకవర్గ కో– ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి సదస్సులో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

» శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం, పాతపట్నంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’సదస్సులు నిర్వహించారు.
» విజయనగరం జిల్లా బొబ్బిలిలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు.
» విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే, కరణం ధర్మశ్రీ నిర్వహించిన సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.
» అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం రోడ్డులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, హిందూపురంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు.
» కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
» తిరుపతిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు నల్లదుస్తులు ధరించి రోడ్డుపై బైఠాయించారు.
» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులో ర్యాలీని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
» కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు నల్ల బెలూన్లు వదిలి వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
» పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాచర్లలో నల్ల బెలూన్లు ఎగుర వేసి నిరసన తెలిపారు. నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈయం.స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ గూండాలు నిర్వహించిన దాడులపై గుంటూరులో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఇందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొని నల్ల రిబ్బన్‌లు ఎగురవేశారు. గుంటూరు నగర శివారు గోరంట్లలో వైఎస్సార్‌సీపీ విజయవాడ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బి.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగురవేశారు.

ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు


