
సాక్షి, తాడేపల్లి: నేడు గుర్రం జాషువా జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. జాషువాకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. కుల వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గళాన్ని కవిత్వంగా మలిచి తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని పోస్టు చేశారు.
కుల వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గళాన్ని కవిత్వంగా మలిచి తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/3xkyzK4yGn
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2025