
సాక్షి: తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 27, 28 రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడ బస చేస్తారు.
శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.అనంతరం తిరుమల నుంచి తిరుగుపయనమవుతారు.