
రాష్ట్రవ్యాప్తంగా బారులు తీరిన రైతులు కనిపించడం లేదా?
రైతులు క్యూలైన్లలో నిలుచున్న ఈ ఫోటోలు నకిలీవని నిరూపించగలరా?
‘ఎక్స్’ఖాతాలో ఫోటోలతో వాస్తవాలను వెల్లడించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సహా ఎరువులను సరఫరా చేయలేని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరిన ఫొటోలను పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి నకిలీవని నిరూపించగలరా? అని సవాల్ విసిరింది.
‘రైతులకు ఎరువుల సరఫరా విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం ఆక్రోశం! రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంట! ప్రెస్‌మీట్‌లో బొంకుల బాబు ఫస్ట్రేషన్! మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోల సర్క్యులేషన్! మరి ఈ ఫోటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోనే కాదు.. రైతులు క్యూలు కట్టిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు ఇక్కడ పెడుతున్నాం. చంద్రబాబు నిజాలకు పాతర వేసి, బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఇవాళ్టి దృశ్యాలివీ! చేతనైతే వీటిని నకిలీవని నిరూపించండి..!’ అని సవాల్ విసిరింది.
రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం @ncbn ఆక్రోశం. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంట. ప్రెస్‌మీట్‌లో బొంకుల బాబు ఫ్రస్టేషన్. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు చేసిన ట్వీట్ ఫొటో ఫేక్ అంటూ పచ్చసైకోల సర్క్యులేషన్. ఈ ఫొటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోయే… https://t.co/dkFKyEEYAv pic.twitter.com/HILCefZooJ
— YSR Congress Party (@YSRCParty) September 3, 2025