
సాక్షి, తాడేపల్లి: గత నెలలో రాష్ట్ర ఆదాయాలు పడిపోవటంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుగ్గన తెలిపిన వివరాలను ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ పోస్టు చేసింది. గత ఆగస్టు నెలలో ఎస్.జీ.ఎస్.టీ. ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికీ, వాస్తవ ఆదాయాలకు చాలా తేడా ఉంది. జీఎస్టీ ఆదాయాలు భారీగా తగ్గిపోవటానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానాలే కారణం’’అని బుగ్గన పేర్కొన్నారు.
‘‘గత ఆగస్టు 23న వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ఆదాయాలు, పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7.0 శాతం మాత్రమే ఉంది. నికర GST ఆదాయాల CAGR 6.94 శాతం మాత్రమే. ఈ ఏడాది కనిపిస్తున్న పెరుగుదల అనేది వాస్తవ వృద్ధి కాదు’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.
Note on SGST revenues for Augsut 2025 by Sri Buggana Rajendranath ( @BugganaRaja )
Quite contrary to the narrative of the State Government, concerning the GST revenues growth during August, 2025, the year-on-year growth of GST revenues during August 2025 over August 2024 of 21%… https://t.co/gYGXjj11sM— YSR Congress Party (@YSRCParty) September 3, 2025
‘‘మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15 శాతం CAGRతో ఉందని చెప్తున్నారు. వాస్తవంగా జీఎస్టీ ఆదాయాల వృద్ధి 7 శాతం మాత్రమే. ఇది చాలా నిరాశాజనకమైన ఫలితం. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి చక్కని విధానాలను రూపొందించాలి. అది వదిలేసి జీఎస్టీ వృద్ధిని విజయంగా చూపించుకోవటానికి తాపత్రయ పడుతోంది’’ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు.