
సాక్షి, అమరావతి: దగుల్భాజీ పోస్ట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై లోకేష్ పైశాచిక ప్రచారానికి తెరతీశారు. తల్లి విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ ఫేక్ ప్రచారం చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే, విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ లోకేష్ దుష్ప్రచారానికి ఒడిగట్టారు.
తప్పుడు ట్వీట్ చేసి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పబోయిన నారా లోకేష్.. గోతిలో పడ్డారు. లోకేష్‌ది సైకో మనస్తత్వం అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల మండిపడతున్నాయి.