
కృష్ణాజిల్లా: దళితులతో చంద్రబాబుకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్టర అధ్యక్షుల టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆనాడే ఆయనతో దళితులకు సంబంధాలు తెగిపోయాయన్నారు. ఈరోజ( ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) మచిలీపట్నంలో కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన టీజీఆర్ సుధాకర్ బాబు.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. వచ్చేది మన ప్రభుత్వమే ... ఎవరికీ భయపడొద్దు. 2027లో ఎన్నికలొచ్చినా... 2029లో ఎన్నికలొచ్చినా వచ్చేది మనమే.
మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్‌మోహన్‌రెడ్డి. టిడిపి నేతలు రౌడీయిజంతో వచ్చినా ...రాజకీయంతో వచ్చినా.. జగన్ కోసం గుండె చూపించి నిలబడదాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుతో దళితులకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయి. దళిత కుటుంబంలో పుట్టిన నన్ను యువజన కాంగ్రెస్ నాయకుడిగా చేసిన వ్యక్తి వైఎస్సార్.
దళితులను రాజకీయంగా చైతన్య పరిచిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. దళితులకు జగన్ ఐదు మంత్రిపదవులిచ్చారు. చంద్రబాబు మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి మాత్రమే ఇచ్చారు. టిడిపిలో ఉండి చంద్రబాబుకోసం తబలా వాయించే దళిత నాయకులకు సిగ్గుందా. దళితుల కుటుంబాల్లో చంద్రబాబు పండుగ లేకుండా చేశారు. కల్తీ మద్యం తయారు చేసి..అమ్మేది టిడిపి వాళ్లు. ఆ మద్యం తాగి చనిపోయేది మా దళితులుకల్తీ మద్యం తాగి చనిపోయిన ప్రతీ ఒక్కరికీ కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.