
తాడేపల్లి: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికి తమకు భయం లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు సిట్ అనేది జేబు సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం. చంద్రబాబు హయాంలో మంచి నీళ్లు దొరకవు. మద్యం దొరుకుతుంది. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానాకి లిక్కర్ కేసు పెట్టారు.
ఇది కుట్ర పూరిత లిక్కర్ కేసు. లేని అభూతకల్పనను సృష్టించి జగన్‌కి సన్నిహితులుగా ఉన్నవాళ్లను, ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ ఆడిస్తున్న కట్టు కధ లిక్కర్ కేసు. ఏం లేదు కాబట్టే నెమ్మదిగా ఎదుర్కొంటున్నాం.
.అమాయకులు అయిన వారితో స్టేట్‌మెంట్స్ ఇప్పించి మద్యం కేసుల్లో ఇరికిస్తున్నారు. వాసుదేవరెడ్డి కూడా చంద్రబాబు కుట్రలో పడ్డారు. చంద్రబాబుకు అనుకులంగా వాగ్మూలం ఇచ్చారు కాబట్టే కేంద్ర సర్వీస్‌లోకి పంపారు. సిట్ దర్యాప్తు లోప భూయిష్టంగా మారిపోయింది. ఎందుకు సిట్ చంద్రబాబు నాయుడుకి జేబు సంస్ధగా మారిపోయింది?, 90 రోజులు పాటు చిత్ర హింసలకు గురిచేశారు.
డ్రోన్ కెమెరాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాకా బెల్ట్ షాపులను లేకుండా చేశారు. మద్యాన్ని తాగుతున్న వాళ్లను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వమే అమ్మింది. ధర పెంచింది. మద్యా న్ని అందని ద్రాక్షగా జగన్ చేస్తే.. చంద్రబాబు చదువును, ఉపాధిని అందని ద్రాక్షగా చేశారుఉ. కిల్లీ షాపుల్లో కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. టీనిపై టీడీపీ సవాల్‌కి సిద్ధం.
గత ప్రభుత్వ హయంలో డిస్కరీలు అన్నింటికి చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చినవే.. చర్చకు సిద్దం. కోర్టు అడిగినా ప్రభుత్వానికి సిగ్గులేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బ్యారెక్ మొత్తం ఇచ్చాం. దోమలు కుడుతున్నాయని ఒకసారి, డెంగ్యూ అని ఒకసారి , దద్దుర్లు వస్తున్నాయని బెయిల్ కావాలని అడిగారు. అన్ని రోగాలకు బెయిల్ మందు అని చంద్రబాబు అడిగారు. రాజమండ్రి నుండి భారీ ర్యాలీ చేశారు.
ఇన్ని రోగాలు ఉన్నవాడు ర్యాలీ చేస్తారా?, ఎంతమందిని అరెస్ట్ చేసినా రాష్ట్ర ప్రజలకోసం జగన్ చేసే యుద్దన్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు. ప్రజల తరపున జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబుకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది.. న్యాయం నిలబడుతుంది.. వంద మద్యం కేసులు పెట్టినా మా గుండె ధైర్యాన్ని తగ్గించలేరు’ అని టీజేఆర్ స్పష్టం చేశారు.