
కాకినాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను డీఏ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉద్యోగులకు డీఏ పేరుతో ప్రచారం సాగిందని, అయితే చివరకు ఒక్క డీఏని ప్రకటించి పండుగ చేసుకోమంటున్నారని కురసాల మండిపడ్డారు.
‘ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క డిఎ ప్రకటించారు. దీంతో పండుగ చేసుకోమంటున్నారు.లెక్కప్రకారం నాలుగు డీఏలు ఇవ్వాలి,. ఒక్కసారి క్షేత్ర స్ధాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో మోసం చేసి ముంచేశాడు. ఫీజు రియింబర్మెంట్ చెల్లించకుండా విద్యార్ధులను మోసం చేశాడు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన నాడు-నేడును చంద్రబాబు నీరుగార్చేశారు.
వారం రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యులు సమ్మె చేస్తున్నా...వారితో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాడం లేదు. చంద్రబాబు మారేడేమో అని ఉద్యోగులు అనుకున్నారు. ఉద్యోగుల డిఎ విషయంలో పెద్ద హైడ్రామా చేసే ప్రభుత్వం ఏదీ ఉండదేమో.. 16 నెలల్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. మసిబూసి మారేడు కాయ చేసి రాష్ట్రంలో ఏదో గొప్పగా జరిగిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఓపిఎస్ నే అమలు చేస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు లో ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏలాంటి అలవెన్సులు,బకాయిలు చెల్లించారు.
పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు..ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్‌లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు.
ఆబ్కాస్‌ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్ధలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.’ అని కురసాల తెలిపారు.
ఇదీ చదవండి:
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా