
సాక్షి,గుంటూరు: 9వ తేదీన రైతుల తరుఫున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్నీ ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరుఫున వైఎస్సార్‌సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో లోకేష్ పోస్టు చేసి ప్రేలాపనలు పేలుతున్నారు.
లోకేష్.. మీ బాబాయిని సంకెళ్లతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్‌లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు.
దౌర్భాగ్యమైన పద్దతుల్లో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌పై మీరు బురదజల్లే పనిలో ఉన్నారు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అధికారం శాశ్వతం కాదు. వైఎస్ జగన్ మీద బురదజల్లడం మానుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు.
