అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై టీడీపీ దౌర్జన్యం | TDP Attack On Sakshi Media houses Updates | Sakshi
Sakshi News home page

అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాల వద్ద టీడీపీ దౌర్జన్యం

Jun 9 2025 4:56 PM | Updated on Jun 9 2025 9:45 PM

TDP Attack On Sakshi Media houses Updates

రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు.  విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సాక్షి కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా ప్లాన్‌ చేసి ‘సాక్షి’పై దాడులకు దిగుతుంది పచ్చపార్టీ. ఆ వ్యాఖ్యలతో సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అసత్య  ఆరోపణలతో దాడులకు పాల్పడుతుంది పచ్చదండు. సాక్షిపై అసత్య ఆరోఫణలు అనేవి   కేవలం దాడులు చేసేందుకే అనే విషయం తేటతెల్లమైంది. టీడీపీ గూండాల దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర బట్టబయలైంది. 

విజయవాడ 

  • సాక్షి మీడియా కార్యాలయం పై టిడిపి పార్టీ రౌడీల దాడుల పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు
  • సాక్షి మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్
  • డీసీపీ సరితకు వినతిపత్రం అందించిన విజయవాడ బ్రాంచి మేనేజర్ యశోధరాజు, సాక్షి పేపర్, టీవీ ప్రతినిధులు

కర్నూలు:

  • సాక్షి పత్రిక మీడియా కార్యాలయంపై  టీడీపీ రౌడీల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి మీడియా పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరిన జర్నలిస్టుల సంఘాల నేతలు
  • కర్నూలు ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆచారికి వినతి పత్రాన్ని అందించిన సాక్షి మీడియా పాత్రికేయులు
     

సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులు

👉 ఏపీలో అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై  టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులు
            
👉టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులకు కుట్ర

👉రాళ్లు, కర్రలతో దాడులు చేస్తన్న టీడీపీ గూండాలు

👉దాడులకోసం ఉదయం నుంచి టీడీపీ మూకల మోహరింపు

👉పథకం ప్రకారం ఆర్గనైజ్డ్‌గా సాక్షి కార్యాలయాలపై దాడులు

👉విజయవాడ, మంగళగిరి, వైఎస్సార్‌ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళంలో దాడులు

👉సాక్షి బోర్డులు ధ్వంసం చేసి, ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నం

👉అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు

👉రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న అధికార పార్టీ

👉రాష్ట్ర చరిత్రలో ఏ మీడియాపైనా జరగని రీతిలో టీడీపీ నేతల దాడులు
 

మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ దౌర్జన్యం

👉సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం

👉మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యం

👉. టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు కలిసి సాక్షి కార్యాలయం బోర్డు ధ్వంసం

👉బోర్డున ధ్వంసం చేసిన మాదిగ కార్పోరేషన్‌ చైర్మన్‌ శిరీష్‌

👉అడ్డుకునేందుకు పోలీసులు యత్నం, వాగ్వాదం

ఆందోళన పేరుతో విజయవాడ,  మంగళగిరి, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు.  రేణిగుంట సాక్షి ఆఫీస్‌ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.

ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడి

అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు.  నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు.  ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.  శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement