
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.