
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు హల్‌చల్ చేశారు. కర్రలు, రాడ్‌లతో బీభత్సం సృష్టించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. వారిని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
