
- రెండేళ్లు పూర్తిచేసుకున్న ఏలూరు మెడికల్ కాలేజీ
- వైఎస్ జగన్ హయాంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం
- వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ బాబు అసత్య ప్రచారం
- వైద్య కళాశాలను సందర్శించి ఫొటోలు దిగిన అబ్బయ్యచౌదరి, జయప్రకాష్
ఏలూరు టౌన్ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెలీ్ఫలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకా‹Ù, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ తరహా లుక్‌తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు.
‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు,
సెలీ్ఫలు దిగారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సు«దీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణే‹Ù, అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీ‹Ù, బీసీ సెల్ కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌జాబ్ తదితరులు పాల్గొన్నారు.

300 మంది విద్యార్థులు చదువుతున్నారు: ప్రిన్సిపాల్
ఏలూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్ 2న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్‌లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూంలు, ల్యాబ్స్, టీచింగ్ రూమ్స్ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్ 2న 150 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో క్లాస్‌లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు.
జగన్ చెప్పింది చేసి చూపిస్తారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్‌లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెపె్టంబర్ 2 నాటికే క్లాస్‌లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు.
– మామిళ్ళపల్లి జయప్రకాష్ ,
ఏలూరు సమన్వయకర్త

ప్రైవేటు పరం చేయటం న్యాయమా?
వైఎస్సార్‌సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి.
– కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే