రేపటి నుంచి వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన | YS Jagan Pulivendula tour from 21 April 2026 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన

Apr 19 2026 11:05 PM | Updated on Apr 20 2026 1:32 PM

YS Jagan Pulivendula tour from 21 April 2026

సాక్షి, అమరావతి/కడప ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందు­లలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 22న ఉదయం పులి­వెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.

ఇటీవల మృతి చెందిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌ రెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి ప్ర­జాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అ­క్కడి ని­వాసంలో బస చేస్తారు. 23న ఉదయం పులి­వెందుల నుంచి తిరుగు పయనమవుతారు.

వైఎస్ జగన్ పులివెందుల టూర్.. పూర్తి షెడ్యూల్..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement