సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్.. వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు.
👉 ఆలయ కార్యక్రమం అనంతరం సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను, నిర్వాహకులను అభినందించనున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.


