
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయనకు నివాళులు అర్పించారు. రామ్మోహన్a చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
