నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి వ్రస్తాపహరణం! | YS Jagan expresses strong anger towards CM Chandrababu | Sakshi
Sakshi News home page

నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి వ్రస్తాపహరణం!

Nov 22 2026 5:29 AM | Updated on Nov 22 2026 5:29 AM

YS Jagan expresses strong anger towards CM Chandrababu

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం  

ఎన్నిక ఏదైనా చివరకు మొత్తం ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌ 

ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్స్‌కు పాడెకట్టిన వైనం.. ఐదేళ్ల మా పాలనలో రాష్ట్రం సుస్థిరం.. శాంతియుతం  

అలాంటి రాష్ట్రానికి రక్తపు మరకలు అంటించడం చంద్రబాబుకే సాధ్యం 

వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై హత్యాయత్నాలు చంద్రబాబు మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం 

చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు.. హే రామ్, సేవ్‌ ఆంధ్ర  

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ గూండాల దౌర్జన్యకాండపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి వ్రస్తాపహరణం జరుగుతోందంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దారుణ ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని వీడియోలను జత చేస్తూ.. ‘హే రామ్‌.. సేవ్‌ ఆంధ్ర’ అంటూ నినదిస్తూ.. రిగ్గింగ్‌ మాస్టర్‌ సీబీఎన్‌ (నారా చంద్రబాబునాయుడు) హ్యాష్‌ ట్యాగ్‌తో ‘ఎక్స్‌’లో శనివారం ఆయన పోస్టు చేశారు. సంచలనం రేపిన ఈ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ప్రజాస్వామ్యం కాదు.. నారా స్వామ్యం 
‘మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌! ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌! గొర్రె తోలు కప్పుకున్న తోడేలు –‘‘నారా స్వామ్యం’’! నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి ‘‘వస్త్రాపహరణం’’! ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ (ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్స్‌)కు పాడె కట్టిన ‘‘ప్రజాస్వామ్యం’’! నామినేషన్లు వేయనివ్వకుండా, వేసిన వాటిని అధికారులే చించేసిన ‘‘ప్రజాస్వామ్యం’’! 

పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన ‘‘ప్రజాస్వామ్యం’’! గెలిచిన వారిని ఓడినట్టుగా ప్రకటించిన ‘‘ప్రజాస్వామ్యం’’! ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే ‘‘ప్రజాస్వామ్యం’’! నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే ‘‘ప్రజాస్వామ్యం’’! అడ్డుకోవాల్సిన ఎస్‌ఈసీ కూడా పచ్చ ముఠాలో చేరిన ‘‘ప్రజాస్వామ్యం’’! ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ‘‘ప్రజాస్వామ్యం’’! ఇది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం!  

బాధితులపైనే తప్పుడు కేసులు  
పంచాయతీ ఎన్నికల సందర్భంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటి మీదకు వందల మంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, పోలీసుల ముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగు పట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన ‘‘ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. హే రామ్‌.. సేవ్‌ ఆంధ్ర’’ అని వైఎస్‌ జగన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement