అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Expresses Deep Shock Over On Fireworks Explosion Incident In Anakapalle District | Sakshi
Sakshi News home page

అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Apr 13 2025 3:54 PM | Updated on Apr 13 2025 5:48 PM

YS Jagan Expresses Deep Shock Over On Fireworks Explosion Incident In Anakapalle District

తాడేపల్లి,సాక్షి:  అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌  ఆదేశాలు జారీ చేశారు. 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement