ప్రేమించిన వ్యక్తిని మరువలేక.. యువతి ఆత్మహత్య | Young girl ends life in love failure | Sakshi
Sakshi News home page

ప్రేమించిన వ్యక్తిని మరువలేక.. యువతి ఆత్మహత్య

Jun 18 2026 11:37 AM | Updated on Jun 18 2026 11:51 AM

Young girl ends life in love failure

అల్లూరి సీతారామరాజు జిల్లా: చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన యువతి కోడూరు దివ్య (26) దేవరాపల్లిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వి. సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

అంబేరుపురం గ్రామానికి చెందిన కోడూరు సన్నిబాబు కుమార్తె దివ్య విశాఖలోని బంగారు ఆభరణాల దుకాణంలో కొంత కాలంగా పని చేస్తోంది. అక్కడ ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారంతా మాట్లాడుకొని వారి ప్రేమ వ్యవహారాన్ని ఇకపై కొనసాగించకుండా అంగీకారం కుదుర్చుకున్నారు. 

అప్పటి నుంచి దివ్య మానసిక ఒత్తిడికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వారం రోజులు క్రితం కుమార్తె దివ్యను దేవరాపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకువచ్చారు. ప్రేమ వ్యవహారం విఫలమవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య మంగళవారం సాయంత్రం తన బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సన్నిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ  తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement