‘టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. పెన్‌ కెమెరాలో రికార్డ్‌ చేశా’ | Women Sensational Allegations On Satyavedu TDP MLA Koneti Adimulam, More Details Inside | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. పెన్‌ కెమెరాలో రికార్డ్‌ చేశా’

Sep 5 2024 12:47 PM | Updated on Sep 6 2024 11:15 AM

Women Sensational Comments On Satyavedu Tdp Mla Koneti Adimulam

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.

సాక్షి, చిత్తూరు: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని.. ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్‌ కెమెరాలో రికార్డ్‌ చేశా. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్‌ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్‌ హోటల్‌ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’’ బాధితురాలు డిమాండ్‌ చేసింది.

..ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో  పలు కార్యక్రమాల్లో ఆదిమూలం  కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నా పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు

..ఆదిమూలం గురించి అందరికీ తెలియాలి అనే పెన్ కెమెరా లో రికార్డు చేశాను. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడు. రాత్రులు మెసేజ్‌లు పంపించి వేధించేవాడు. ఎంతోమంది అమ్మాయిలను టార్చర్‌ చేసేవాడు. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడు. అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలి’’ అని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement