అత్త కాలు విరగొట్టిన అల్లుడు? | Wife and husband incident in Annamayya district | Sakshi
Sakshi News home page

అత్త కాలు విరగొట్టిన అల్లుడు?

Jun 29 2026 11:45 AM | Updated on Jun 29 2026 12:20 PM

Wife and husband incident in Annamayya district

అన్నమయ్య జిలా: కన్నబిడ్డ కాపురంలో వచ్చిన సమస్యలను చక్కబెట్టడానికి వారింటికి వెళ్తే ... విచక్షణారహితంగా దాడిచేసి కాలు విరగ్గొట్టారని బాధితురాలు అమ్రీన్‌ ఆదివారం తెలిపింది. వివరాలు..పలమనేరుకు చెందిన అమ్రీన్‌ కుమార్తె అంజును రెండేళ్ల క్రితం చౌడేపల్లె మండలం కోటూరుకు చెందిన మహబూబ్‌బాషా కుమారుడు ఎండీ గౌస్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొద్దిరోజులపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి కాపురాన్ని సరిదిద్దడానికి కృషి చేసినా మార్పురాలేదు. 

తన కుమార్తెపై అల్లుడు, వారికుటుంబ సభ్యుల వేధింపులు అధికమయ్యాయని అమ్రీన్‌ తెలిపారు. కుమార్తె ఫోన్‌ చేయడంతో ఆదివారం తన మరో ఇద్దరు కుమార్తెలతో కలిసి కోటూరుకు అమ్రీన్‌ వెళ్లారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో అమ్రీన్‌కు కాలువిరిగింది. వెంటనే చౌడేపల్లె 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరుకు తరలించారు. ఈ మేరకు ఘర్షణ కేసు పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement