వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం | Vizag Steel Plant Removing Contract Employees | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

Sep 27 2024 9:29 PM | Updated on Sep 27 2024 9:35 PM

Vizag Steel Plant Removing Contract Employees

సాక్షి,విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4 వేలమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని తీసివేసేందుకు విశాఖ స్టీల్‌ యాజమాన్యం సిద్ధమైంది. తొలగించే కాంట్రాక్టు ఉద్యోగుల్లో సగం మంది నిర్వాసితులే ఉన్నారు. రేపటి నుంచి ఆన్ లైన్ పంచ్ స్టీల్ యాజమాన్యం నిలిపివేయనుంది.

ఉద్యోగుల తొలగింపుపై సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నాయకులు వైజాగ్‌ స్టీల్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగులు తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. స్టీల్‌ ప్లాంట్‌ను  కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ నిల బెట్టుకోవాలి. నాయకులు చెప్పే మాటలకు స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదు’’ అని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement