29న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు | VIP Break Darshan Cancelled at Tirumala on 29th June | Sakshi
Sakshi News home page

29న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Jun 27 2026 9:09 PM | Updated on Jun 27 2026 9:18 PM

VIP Break Darshan Cancelled at Tirumala on 29th June

తిరుమల: వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొన్న కారణంగా అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. ఈ నేపథ్యంలో ఆదివారం సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు. ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శనాలను కూడా ఆరోజు రద్దు చేశారు. 

అదేవిధంగా తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement