నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలి! | Sakshi
Sakshi News home page

నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలి!

Published Mon, Dec 4 2023 11:07 AM

Vijayasai Reddy Fires on Yellow Media and Chandrababu - Sakshi

తాడేప‌ల్లి: తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఎల్లో మీడియా చంద్ర‌బాబును హైలెట్ చేయ‌డం ప‌ట్ల వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఎల్లో మీడియా ‘స్వీయ సంతృప్తి’ పొందుతోంది. తెలంగాణలో పోటీ చేయకుండా ముఖం చాటేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేశారా? అక్కడి ప్రజలకు ఈయనొక మర్చిపోయిన జ్ఞాపకం. గెలుపునకు ఈయన కారణమవుతారా? నిజంగా తన పాత్ర ఉంటే అదెలాగో ఎల్లో మీడియా స్పష్టం చేయాలి! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 బాబు గారిని భుజాలపై మోయాలట
చంద్రబాబు గారి గుణమే...స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడడం. యువ ఓటర్లు మొదటి ఓటు చంద్ర‌బాబుకు వేయాలట! ఆయన సామాజికవర్గం వారు కూకట్  పల్లిలో సోమవారం ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట! అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

 
Advertisement
 
Advertisement