
తిరుపతి, సాక్షి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ (TTD) అంగీకరించింది. ఇందులో భాగంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఆ ప్రకటన మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించే విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్,రూ.300 దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోమవారం,మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనం, బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు మాత్రమే అనుమతి కల్పిస్తుండగా.. సిఫార్సు లేఖపై టీటీడీ ఆరుగురికి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.
