పేలవంగా ప్రారంభోత్సవం
చెరువుల తెల్లకంకణాయిలు
సందర్శకులకు నిరాశ
సూళ్లూరుపేట రూరల్: మూడు రోజులు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు పండుగ తొలిరోజు వచ్చిన సందర్శకులకు నిరాశే ఎదురైంది. శ్రీహరికోట వెళ్లే దారిలో పులికాట్ సరస్సు ఎడారిగా మారింది. దీంతో సరస్సులో నీరు లేక పోవడంతో విదేశీ పక్షులు లేక పులికాట్ సరస్సు వెలవెల పోయింది. ఎంతో దూరం నుంచి వచ్చిన సందర్శకులకు నిరాశ ఎదురైంది.
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్–2026ను ప్రారంభం పేవలంగా సాగింది. రాష్ట్ర మంత్రులు లేకుండా ఎక్కడా హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ , సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. పక్షుల పండుగ సందర్భంగా మేళతాళాలతో, తప్పెట్లు, కేరళ సాంప్రదాయ నృత్యాలతో స్థానిక హోలీక్రాస్ సెంటర్ నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రాంగణం వరకు శోభాయాత్రను నిర్వహించారు. గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ కార్యక్రమం ఫ్లెమింగో బెలూన్ ఎగురవేశారు. పండుగ సందర్భంగా వివిధ శాఖల వారు స్టాళ్లను ఏర్పాటు చేసి, ప్రారంభించారు. అలాగే కబడ్డీ, వాలీబాల్ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌కు విచ్చేసిన విద్యార్థులు, పర్యాటకులకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేటలోని డివైడర్ వద్ద ఇనుప బారికేడ్లు పెట్టడంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించి, సందర్శకులు ఇబ్బందులు పడ్డారు. ప్రారంభోత్సవంలో నృత్యాలు తప్ప ఏమీ లేకుండా చేయడంతో ప్రారంభోత్సవం పేలవంగా సాగింది. పార్టీ నేతలతో సమన్వయం లేకుండా చేసినట్టున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.
తొలిరోజు సందర్శకుల కరువు
దొరవారిసత్రం: జిల్లా అధికారులు, నియోజక వర్గం ప్రజాప్రతినిధులు ఊహించిన స్థాయిలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంకి తొలి రోజు పక్షుల పండుగలో సందర్శకుల తాకిడి పెద్దగా కనిపించడలేదు. బయట ప్రాంతాల నుంచి అరకొరగా విచ్చేసిన సందర్శకులకు, విద్యార్థునులకు సరిపడా మరుగుదొడ్లు వంటివి కేంద్రంలో లేకపోవడంతో ఉన్న మరుగుదొడ్లు వద్ద క్యూ కట్టక తప్పలేదు. అధిక మొత్తంలో సందర్శకుల రాకపోవడంతో చెరువు కట్టపై వాచ్‌టవర్ వెలవెల బోయింది. వ్యూ పాయింట్లు వద్ద సరిపడా బైనోక్యూలర్లు ఏర్పాటు చేయకపోవడంతో సందర్శకులు నిరుత్సాహపడ్డారు. నేలపట్టు పక్షుల కేంద్రం మార్గం మధ్యలో జిల్లా యంత్రాగం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి చిత్రం లేకపోవడంపై ప్రోటోకాల్ ఉల్లఘించారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువు కట్టపై సందర్శకుల లేక
వెలవెలబోయిన వాచ్ టవర్
పేలవంగా ప్రారంభోత్సవం
పేలవంగా ప్రారంభోత్సవం


