శ్రీసిటీలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
● పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి శ్రీసిటీ నమూనా అధ్యయనం
శ్రీసిటీ(సత్యవేడు): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి(యూపీఎస్‌ఐడీఏ) కి చెందిన తొమ్మిది మంది సభ్యుల ప్రతినిధి బృందం కేపీఎంజీ ప్రతినిధులతో కలసి శనివారం శ్రీసిటీని సందర్శించింది. యూపీలోని లలిత్‌పూర్‌లో అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నేపథ్యంలో శ్రీసిటీ అభివృద్ధి నమూనా అధ్యయనం కోసం వీరి పర్యటన సాగింది. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజీవ్ త్యాగి నేతృత్వంలో విచ్చేసిన బృందానికి శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) ఆర్.శివశంకర్ సాదర స్వాగతం పలికారు. అధికారులను స్వాగతించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దేశంలోని వివిధ రాష్ట్రాల పారిశ్రామిక సంస్థలు శ్రీసిటీ మోడల్‌ను ఽఅధ్యయనం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వారి పరిశీలనలు, సూచనలు శ్రీసిటీ భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలకు మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. చర్చల సందర్భంగా శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, బలమైన అనుసంధానం, పెట్టుబడి అవకాశాలు, వ్యాపార అనుకూలతలు, ప్రయోజనాలు, బయోటెక్ ఫార్ములేషన్లతో సహా శ్రీసిటీ బహుళ రంగాల పెట్టుబడి, యూపీ– ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ జనరల్ మేనేజర్ అనురుద్ధ క్షత్రియ సహా పలువురు నీసియర్ అధికారులు చర్చల్లో పాల్గొని, ఉత్తమ ఆచరణలు ప్రభుత్వ సహకారం, సుస్థిరత చర్యలు, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం తదితర అంశాలపై పరస్సర అభిప్రాయాలు పంచుకున్నారు. తమ పర్యటనకు సహకరించిన శ్రీసిటీ ఎండీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీసిటీలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం


