కూతురు కోసం వచ్చి.. కాటికి చేరాడు!
తిరుపతి రూరల్: సంక్రాంతి పండుగకు కూతురుని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఓ తండ్రి ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన తిరుపతి శివార్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా సీకేపల్లి గ్రామానికి చెందిన పగిడి వెంకటేశ్వరరెడ్డి (43) వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. అతని కుమార్తె తిరుపతి శివారులోని తనపల్లి వద్ద ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియ ట్ మొదటి సంత్సరం చదువుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకు వెళ్లడానికి శుక్రవారం రాత్రి బస్సులో తిరుపతికి వచ్చి న వెంకటేశ్వరరెడ్డి తనపల్లి జంక్షన్ వద్ద నడుచుకుంటూ జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న విజయానంద ట్రా వెల్స్ బస్సు ఢీ కొంది. దీంతో తీ వ్ర గాయాలపాలై న వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు 108లో చికిత్స ని మిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు బస్సు డ్రైవర్ వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కూతురు కోసం వచ్చి.. కాటికి చేరాడు!


